జార్ఖండ్ లో కుప్పకూలిన బొగ్గు గని: ముగ్గురు మృతి, శిథిలాల కింద పలువురు
జార్ఖండ్ లో కుప్పకూలిన బొగ్గు గని ఇవాళ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులు ఈ ఘటనలో చిక్కుకున్నారు.

న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ సమీపంలోని బొగ్గుగని శుక్రవారంనాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు బొగ్గు గనిలో చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ బొగ్గుగనిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తుంది. అనుమతి లేకుండా ఈ బొగ్గు గని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.
బొగ్గు వెలికితీతకు స్థానికంగా ఉన్న గ్రామస్తులను బొగ్గు మైనింగ్ నిర్వహిస్తున్న సంస్థ నియమించుకుందని సింధ్రీ డీఎస్పీ అభిషేక్ కుమార్ చెప్పారు. శిథిలాల నుండి స్థానికులు ముగ్గురిని బయటకు తీశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందారని వైద్యులు ప్రకటించారని డీఎస్పీ చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.