పంజాబ్‌లోని జలంధర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఇసుక ట్రాలీని సడెన్ గా టర్న్ చేయడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ఆ వాహనం కింద రెండు కార్లు ఇరుక్కపోయాయి. ఓ కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడికే మృతి చెందారు.
పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ భారీ ఇసుక ట్రాలీ విధ్వంసం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న భారీ వాహనం సడెన్ గా టర్న్ తీసుకోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ఆ వాహనం కింద రెండు కార్లు ఇరుక్కపోయాయి. ఓ కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడికే మృతి చెందారు. మరోవాహనం ఆ ట్రాక్ కింద ఇరుక్క పోయింది. అందులో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటన జలంధర్‌లోని మహిల్‌పూర్ చౌక్ వద్ద చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదం సీసీటీవీ కెమెరాలో చిక్కింది.
ఈ ఘటన ఫగ్వారా, చండీగఢ్‌లను కలిపే జాతీయ రహదారిపై పంజాబ్‌లోని బెహ్రామ్ వద్ద జరిగింది. పోలీసులు విడుదల చేసిన వీడియోలో హైవేపై వెళ్తున్న 18-చక్రాల భారీ వాహనం ఒక్కసారిగా మలుపు దగ్గర టర్న్ తీసుకోవడం చూడవచ్చు. ఇసుకను ఓవర్ లోడ్ చేసుకుని వేగంగా వెళ్తున్న భారీ వాహనం వేగంగా సడెన్ గా డ్రైవర్ టర్న్ చేయడంతో.. బ్యాలెన్స్ కోల్పోయి ఆ ట్రక్ బోల్తాపడింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి.
భారీ వాహనం నడుపుతున్న డ్రైవర్.. వేగాన్ని తగ్గించకుండా అకస్మాత్తుగా మలుపు తీసుకున్నాడు. దీంతో ఆ భారీ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి.. బోల్తా పడింది. అందులో ఉన్న ఇసుక మొత్తం రోడ్డుపై పడింది. ఆ భారీ వాహనం కింద ఓ కారు పడి నుజ్జునుజ్జు అయ్యింది. ఆ కారులో ఉన్న దంపతులు, వారి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.
రెండో కారు కూడా పూర్తిగా డ్యామేజ్ అయితే అందులో ఉన్నవారంతా తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. కానీ, వారి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం హైవేపై అమర్చిన కెమెరాల్లో కూడా రికార్డైంది. ప్రమాదం జరిగిన తర్వాత ట్రాలీ డ్రైవర్ మేజర్ సింగ్ పరారయ్యాడు.
ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద ట్రైలర్ డ్రైవర్ మేజర్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి బటాలా నుంచి గర్‌శంకర్‌కు వెళ్తున్నారు. అయితే దారిలో ప్రమాదానికి గురయ్యాడు. బహ్రం పోలీసులు ట్రాలీ డ్రైవర్ మేజర్ సింగ్‌పై కేసు నమోదు చేశారు.
