కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. కుల్గామ్‌లో ఉగ్రవాదులకు, పోలీసులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీస్ అధికారి మరణించగా... ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి తర్వాత దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే గత వారం 10 రోజులుగా కశ్మీర్ లోయను బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సైన్యం, కశ్మీర్ పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి.

ఈ క్రమంలో కుల్గామ్‌లోని తురిగామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారిని డీఎస్పీ అమన్ కుమార్‌గా గుర్తించారు.

ఈయన గత రెండేళ్లుగా కుల్గామ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం పుల్వామాలో సీర్‌పీఎఫ్‌ బలగాలపై దాడి జరిగిన ప్రాంతానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది.