Asianet News TeluguAsianet News Telugu

చిన్నారుల్లో బ్లాక్ ఫంగస్.. ఏకంగా కళ్లు తీసేశారు..!

ఇటీవల కంట్లో ఏదో గుచ్చుకుంటున్నట్లుగా ఇబ్బంది పెడుతుండటంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే బ్లాక్ ఫంగస్ కంటిని పూర్తిగా తినేసింది. కన్ను మొత్తం నల్లగా మారింది. 

3 children infected by black fungus in Maharastra
Author
Hyderabad, First Published Jun 18, 2021, 1:46 PM IST

కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతోందని ఆనందపడేలోపు బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఎక్కువగా డయాబెటిక్ ఫేషెంట్లకు మాత్రమే బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయ్యింది. ఇప్పుడు చిన్నారుల్లో సైతం ఈ రకం కేసులు వెలుగుచూస్తున్నాయి. 

 బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి ముగ్గురు చిన్నారుల కళ్లు తొలగించాల్సి వచ్చింది. వీరిలో4,6,14 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఫంగస్‌ బారిన పడిన ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో, మరోకరి వేరేక ఆస్పత్రిలో సర్జరీ చేసి ఒక కన్ను తొలగించారు

పూర్తి వివరాల్లోకి వెళితే...  ముంబయికి చెందిన 14ఏళ్ల బాలికకు డయాబెటిక్ సమస్య ఉంది. కాగా.. ఇటీవల కంట్లో ఏదో గుచ్చుకుంటున్నట్లుగా ఇబ్బంది పెడుతుండటంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే బ్లాక్ ఫంగస్ కంటిని పూర్తిగా తినేసింది. కన్ను మొత్తం నల్లగా మారింది. 

 బాలిక పరిస్థితి విషమిస్తుండటంతో వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. దాదాపు ఆరు వారాల పాటు వైద్యం చేసినప్పటికి.. ఫలితం లేకపోయింది. చివరకు బాలిక కంటిని తొలగించాల్సి వచ్చింది. 

ఇక పైన చెప్పుకున్న మరో చిన్నారులిద్దరికు డయాబెటిక్‌ సమస్య లేదు. కానీ కోవిడ్‌ బారినపడ్డారు. ఆ తర్వాత వీరిలో బ్లాక్‌ ఫంగస్‌ వెలుగు చూసింది. చిన్నారులిద్దరిని ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్‌ ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత చిన్నారులిద్దరికి ఆపరేషన్‌ చేసి కన్ను తొలగించారు. 

సర్జరీ చేసి కన్ను తొలగించకపోతే బాధితుల జీవితం ప్రమాదంలో పడేదన్నారు వైద్యులు. ఇక 16 ఏళ్ల బాధితురాలు నెల రోజుల క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది. కోవిడ్‌ బారిన పడి కోలుకుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె డయాబెటిస్‌ బారిన పడింది. ఆమె పేగుల్లో రక్తస్రావం కాసాగింది. యాంజియోగ్రఫీ చేసి ఆమె కడుపు దగ్గర రక్తనాళాలకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు గుర్తించామని తెలిపారు వైద్యులు. 

Follow Us:
Download App:
  • android
  • ios