ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లా ఫకీర్‌పురా గ్రామంలో విషాదఘటన చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా కూలిన మట్టి దిబ్బల కింద సమాధి అయ్యారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ఈటాలో బుధవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నయాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. బుధవారం కూలిన భారీ మట్టి పెళ్ల కింద ముగ్గురు పిల్లలు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలోని ఫకీర్‌పురా గ్రామంలో సచిన్, కౌశల్, గోవింద్ (12 సంవత్సరాలు)గా గుర్తించబడిన ముగ్గురు పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా మట్టి పెళ్లల కింద సజీవ సమాధి అయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి.
చిన్నారులు రోజూ వచ్చే సమయానికి పాఠశాల నుంచి ఇంటికి రాకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులతో కలిసి వెతకగా, మట్టి పెళ్లల కింద పడి మృత్యువాత పడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుంది. మృతుల శవాలను శవపరీక్షకు తరలించారు. పోలీసు విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలాగే, సెప్టెంబరులో, ఇటావా జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్, ఇటావాలోని సివిల్ లైన్ ప్రాంతంలోని చంద్రపురా గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ కూలిపోవడంతో నలుగురు పిల్లలు మరణించారు, ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన చిన్నారులను సింకు (10), అభి (8), సోను (7), ఆర్తి (5)గా గుర్తించగా, గోడ కూలిన ఘటనలో రిషవ్ (4), వారి అమ్మమ్మ శారదాదేవి (75) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లాకు చెందిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఇటావాలో గోడ కూలిన కారణంగా సంభవించిన మరణాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
