Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో భర్త.. ఇండియాలోని భార్యను చంపమని సుపారీ.. ట్విస్ట్ ఏంటంటే....

తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ పట్టణంలో మే 21వ తారీఖున సాయంత్రం 28 యేళ్ల ఓ యువతి స్కూటీమీద వెడుతోంది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఆమె డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెల్తోంది. ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ టాటా ఏస్ వాహనం ఆమె స్కూటీని ఢీ కొట్టింది. 

28-Yr-old woman killed in road accident in tamilnadu - bsb
Author
Hyderabad, First Published May 27, 2021, 9:28 AM IST

తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ పట్టణంలో మే 21వ తారీఖున సాయంత్రం 28 యేళ్ల ఓ యువతి స్కూటీమీద వెడుతోంది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఆమె డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెల్తోంది. ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ టాటా ఏస్ వాహనం ఆమె స్కూటీని ఢీ కొట్టింది. 

తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆమె ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఆమె మెడలో ఉన్న ఐడీ కార్డును బట్టి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు ఆ షాకింగ్ న్యూస్ విని కుప్పకూలిపోయారు. 

కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఎందుకో అది అనుకోకుండా జిగిన ప్రమాదం కాదేమోనని డౌట్ వచ్చింది. దీంతో వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి చూశారు. స్థానికులకు ఆరా తీశారు. వాళ్లు చెప్పిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో కావాలనే ఆమెను చంపేశారని కేసు పెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెడితే షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి..

ఇంతకీ అసలేం జరిగిందంటే... తమిళనాడులోని తిరువారూర్ పట్టణానికి చెందిన 28 యేళ్ల జయభారతి మే 21న జరిగిన రోడ్డ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువారూర్ తాలూక పోలీసు అధికారులు ఐపీసీ 279, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ క్రమంలో విష్ణు ప్రకాశ్ అనే వ్యక్తితో జయభారతికి 2015లో పెళ్లి జరిగిందని గుర్తించారు. విష్ణు ప్రకాష్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తుండడంతో పెళ్లైన తర్వాత ఆమె తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లినట్టు పోలీసుల విచారణ తేలింది. 

అయితే భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జయభారతి తన భర్తను వదిలేసి, ఇండియాకు వచ్చారని.. ఆ తరువాత ఇక్కడ ఓ పోస్టాఫీస్ లో విధులు నిర్వర్తిన్నట్లు పోలీసులు గ్రహించారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇు కుటుంబాల సభ్యులు విఫల ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు..

విషయం విడాకుల దాకా వెళ్లిన క్రమంలో జయభారతి ప్రమాదంలో మరణించిందని పోలీసులు గ్రహించారు. దీంతో కేసు విచారణను మరింత వేగవంతం చేసిన పోలీసుు మూడు బృందాలుగా విడిపోయి, ప్రమాద ఘటన వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేశారు. 

3 లక్షల ఇళ్లు ధ్వంసం, లక్షలాది ఎకరాల పంట నష్టం : బెంగాల్‌‌కు కడగండ్లు మిగిల్చిన యాస్...

సీసీటీవీ పుటేజీ ఆధారంగా టాటా ఏస్ యజమాని సెంతికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అయితే సెంతి కుమార్ పోలీసులకు కట్టుకథలు చెప్పాడు. ఆ టాటా ఏస్ ను తాను గతంలోనే అమ్మేశానని, ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. 

ఈ క్రమంలో పోలీసులు జగన్ (37), రాజా (45),ప్రసన్న (34) అనే ముగ్గురిని పట్టుకుని విచారించారు. ఈ క్రమంలో సెంతికుమార్ చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది. జయభారతి మరణానికి సెంతికుమార్ కు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ నలుగురినీ పోలీసుల స్టైల్లో ఎంక్వైరీ చేశారు.    

దీంతో అసలు నిజం బయటపడింది. అమెరికాలో ఉంటున్న జయభారతి భర్తే తన భార్యను చంపమని తమకు సుపారీ ఇచ్చాడని వాళ్లు ఒప్పుకున్నారు. విడాకులు ఇస్తే భరణం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో జయభారతిని యాక్సిడెంట్ చేసి, చంపాల్సిందిగా అమెరికా నుంచి విష్ణు ప్రకాశే తమను సంప్రదించి డబ్బులు ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. 

దీంతో సెంతికుమార్, రాజా, ప్రసన్న, జగన్‌లను రిమాండ్ కు తరలించిన పోలీసులు  రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. విష్ణు ప్రకాశ్ విషయాన్ని అమెరికాలోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. త్వరలోనే  విష్ణు ప్రకాశ్ ను ఇండియాకు రప్పించి అరెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios