గాలిపటం దారి మెడకు చీరుకుపోయి.. ఓ సివిల్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ లో చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్తూ ఇలా మృత్యువాతపడటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన మానవ్ శర్మ(28) రాఖీ పండగ జరుపుకోవడానికి బంధువుల ఇంటికి వచ్చాడు. పండగ జరుపుకున్న అనంతరం తర్వాతి రోజు తన ఇద్దరు చెల్లెల్లతో కలిసి స్కూటీ మీద హరి నగర్ లో ఉండే తన ఆంటీ వాళ్ల ఇంటికి బయలుదేరారు.

కాగా ఆ సమయంలో ఓ వ్యక్తి ఆ సమయంలో గాలి పటం ఎగురవేశాడు. అది కాస్త వచ్చి... స్కూటీ మీద వెళ్తున్న మానవ్ మెడకు చుట్టుకుంది. ఆ గాలిపటం దారం మెడకు చుట్టుకోవడంతో... అతని మెడ తెగింది. దీంతో... అతను స్కూటర్ మీద నుంచి కింద పడిపోయాడు. కాగా.. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

కానీ గాయం పెద్దగా అవ్వడంతో అతను ఆస్పత్రికి వెళ్లేలోపే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మానవ్ శర్మ ఓ ప్రైవేట్ బిల్డర్ కి సివిల్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం అచ్చం ఇలాంటి సంఘటనలే మరో 15 జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా... వారంతా గాలిపటం దారం వల్ల గాయపడగా... మానవ్ మాత్రం మృతి చెందడం గమనార్హం.