మహారాష్ట్ర: మావోయిస్ట్‌లకు భారీ దెబ్బ.. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 26కి చేరిన మృతులు
మహారాష్ట్రలోని (maharashtra) గడ్చిరోలిలో (gadchiroli district) శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter) మావోయిస్టులకు (maoist) గట్టి దెబ్బ తగిలింది. కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు మరణించిన మావోల సంఖ్య 26కి చేరింది.
మహారాష్ట్రలోని (maharashtra) గడ్చిరోలిలో (gadchiroli district) శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter) మావోయిస్టులకు (maoist) గట్టి దెబ్బ తగిలింది. కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు మరణించిన మావోల సంఖ్య 26కి చేరింది. ధనోరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లుగా గడ్చిరోలి ఎస్పీ ప్రకటించారు.
Also Read:Gadchiroli encounter: గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. అనంతరం ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా జల్లెడ పడుతున్నారు.