Asianet News TeluguAsianet News Telugu

స్ట్రెయిన్ అలజడి.. బ్రిటన్ నుంచి దేశానికి వచ్చినవారిలో 25 మందికి కరోనా !!

దేశంలో స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా నుంచి కాస్త కోలుకున్నట్టుగా అనిపిస్తున్న తరుణంలో బ్రిటన్ లో కొత్త రకం కరోనా భారత్ ను వణికిస్తోంది.  బ్రిటన్ నుంచి తాజాగా మనదేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరస్సా.. లేక పాతదేనా అనే సంగతి నిర్థారించడానికి ఆయా రాస్ట్రాల నుంచి బాధితుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపుతున్నారు. 

25 passengers from UK test positive for Covid-19, states begin contact tracing - bsb
Author
Hyderabad, First Published Dec 23, 2020, 9:57 AM IST

దేశంలో స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా నుంచి కాస్త కోలుకున్నట్టుగా అనిపిస్తున్న తరుణంలో బ్రిటన్ లో కొత్త రకం కరోనా భారత్ ను వణికిస్తోంది.  బ్రిటన్ నుంచి తాజాగా మనదేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరస్సా.. లేక పాతదేనా అనే సంగతి నిర్థారించడానికి ఆయా రాస్ట్రాల నుంచి బాధితుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపుతున్నారు. 

సెప్టెంబర్ నుంచే అక్కడ కొత్త రకం  వైరస్ ప్రబలుతున్నందున్న ఇప్పటికే అక్కడి నుంచి వచ్చినవారి ద్వారా మన దేశానికి కొత్త వైరస్ చేరి ఉండొచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్ నుంచి సోమవారం రాత్రి డిల్లీకి ఎయిరిండియా విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు కొవిడ్ బాధితులుగా తేలారు. వాస్తవానికి వారిలో ఐదుగురే ఢిల్లీలో పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. 

మరొకరు అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్నాక పరీక్ష చేయించుకోగా కరోనా బారిన పడినట్లు తేలింది. వీరిి రక్త నమూనాలను అధికారులు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రానికి (ఎన్సీడీసీ) పంపించారు. లండన్ నుంచి కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్న విమానంలో ఇద్దరు కరోనా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. పాజిటివ్ గా తేలిన ఇద్దరికి సమీపంలో కూర్చున్న వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

లండన్ నుంచి మంగళవారం ఉదయం అహ్మదాబాద్ కు చేరుకున్న ప్రయాణీకుల్లో ఐదుగురు కొవిడ్ పాజిటివ్ గా తేలారు. వారిలో ఒకరు బ్రిటన్ వాసి కావడం గమనార్హం. బాధితులను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బ్రిటన్ నుంచి మూడు విమానాల్లో 590 మంది ప్రయాణికులు మంగళవారం ముంబయికి చేరుకున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ పాజిటివ్ గా తేలలేదని చెప్పారు. 

బ్రిటన్ నుంచి 250 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బందితో సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత అమృత్ సర్ కు చేరుకున్న ఎయిరిండియా విమానంలో 8మంది కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. వారిలో విమాన యాన సిబ్బంది కూడా ఒకరు ఉన్నారు. ఆర్ టీ-పీసీఆర్ పరీక్షల నిర్వహణలో బాగా ఆలస్యం అవుతుందంటూ అమృత్ సర్ విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. 

బుధవారం నుంచి ఈ నెల 31 వరకు భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం అర్థరాత్రి వరకూ బ్రిటన్ నుంచి ప్రయాణికులు రానుండటంతో పాజిటివ్ గా తేలే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

ఇక లండన్ నుంచి బెంగళూరుకు ఈ నెల 19న వచ్చిన 38మంది ప్రయాణికుల్లో తాజా పరీక్షల అనంతరం ఇద్దరు పాజిటివ్ గా తేలారు. వీరిద్దరూ తల్లీకూతుళ్లు, తల్లికి 35 యేళ్లు కాగా, పాప వయసు ఆరేళ్లు, వీరి  రక్త నమూనాలను పుణెలోని ఎన్ఐవీకి పంపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios