భువనేశ్వర్: ఒడిశాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల వయస్సు గల మహిళ దుస్తులు విప్పేసి, నగ్నం చేసి, దారుణందా చితకబాదారు. కట్నం డబ్బులు తేలేదని నిందిస్తూ అత్తంటివారు ఆ అమానుషానికి ఒడిగట్టారు. 

ఆ సంఘటన ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో చోటు చేసుకుంది. ఆ సంఘటనను కెమెరాలో చిత్రీకరించారు. ఆ సంఘటనపై మహిళ సమీప బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కోరుక్ గ్రామంలోని కొందరు స్థానికులు జోక్యం చేసుకుని దాడిని ఆపడానికి ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు వారి మాట వినలేదు. పోలీసులు మహిళ వాంగ్మూలం రికార్డు చేశారు 

మహిళ అత్తింటివారు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.