మల్కాజిగిరి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా... అతని చావుకి అతని మిత్రులే కారణమేమో అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఉప్పల్ కి చెందిన ప్రసాద్ ఆదివారం రామాంతపూర్ బైపాస్ రోడ్డు వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. కాగా... తాగిన మైకంలో అతని మిత్రులు ప్రసాద్ ని రాళ్లతో, కర్రలతో దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రసాద్ కి అతని స్నేహితులకు మధ్య సంవత్సర కాలంగా వివాదం నడుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో... వాళ్లే పథకం ప్రకారం ప్రసాద్ ని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.