జ‌మ్మూక‌శ్మీర్‌లో శనివారం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పూంచ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు   లోయ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 లోర‌న్ నుంచి పూంచ్ దిశ‌గా వెళ్తుండగా..  బస్సు ప్రమాదానికి గురైంది.  మండి ప్రాంతంలోని ప్లేరాలో అది లోయ‌లో ప‌డినట్లు అధికారులు గుర్తించారు. ప్ర‌స్తుతం అధికారులు రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నారు. గాయ‌ప‌డ్డ‌వారిని మండి హాస్ప‌ట‌ల్‌లో చేర్పించారు. లోయలో ప‌డ్డ బ‌స్సు రిజిస్ట‌ర్ నెంబ‌ర్ జేకే02డ‌బ్ల్యూ0445. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.