Braindead: తమిళనాడులో జరిగిన ప్రమాదంలో తేని జిల్లా ఉత్తంపాళయానికి చెందిన శక్తికుమార్ అనే యువ‌కుడి తీవ్ర గాయాల పాలై.. బ్రెయిన్ డెడ్ కు గుర‌య్యాడు. ప్రాణం ఉన్న యువకుడు ఎనిమిది మందికి పునర్జన్మ కల్పించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఆ వార్త విన్న తల్లిదండ్రులు మ‌రో మాట లేకుండా  ఆ యువ‌కుడి అవయవాలను ఇతరులకు దానం చేశారు.

Braindead: 22 ఏళ్ల యువ‌కుడు... తాను చనిపోతూ మరో ఐదుగురికి పునర్జన్మ అందించింది. తమిళనాడు చెందిన శక్తికుమార్ ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బతకడం కష్టమని బ్రెయిన్ డెడ్ అయిన‌ట్టు డాక్ట‌ర్లు గుర్తించారు. అయితే.. ప్రాణం ఉన్న యువకుడు ఎనిమిది మందికి పునర్జన్మ కల్పించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఆ విష‌యం తెలుసుకున్న ఆ యువ‌కుడి తల్లిదండ్రులు మ‌రో మాట లేకుండా ఆ అవయవాలను ఇతరులకు దానం చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు. దీంతో ఆ యువ‌కుడి గుండె, కాలేయం, మూత్ర పిండాలు ఇతర అవయవాలను ఐదుగురికి అమర్చారు. ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి అందరూ ఒక్కసారి హ్యాట్సాఫ్ చెప్పేశారు.

తమిళనాడులో శనివారం జరిగిన ప్రమాదంలో తేని జిల్లా ఉత్తంపాళయానికి చెందిన శక్తికుమార్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ఆరోగ్యం బాగోకపోవడంతో మధురైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడ డాక్టర్లు విద్యార్థికి ఎక్కువ గాయాలు కావడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. మెదడు పనితీరు, పరీక్ష కోసం అవసరమైన పరీక్షలు. 

మదురైలోని మీనాక్షి మిషన్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఎంఎంహెచ్‌ఆర్‌సీ) వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువ‌కుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే.. ప్రాణం ఉన్న యువకుడు ఐదుగురికి పునర్జన్మ కల్పించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఆ యువ‌కుడి అవయవాల‌ను దానం చేయాల‌ని కోరారు. త‌మ కొడుకు ప్రాణాలు పోతున్న మ‌రో ఎనిమిది మందికి పున‌రజ‌న్మ ఇవ్వ‌గ‌ల‌డ‌ని భావించిన ఆ త‌ల్లిదండ్రులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. 

మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఆపరేషన్ తర్వాత అవయవ దాన ప్రక్రియ బుధ‌వారం పూర్తయింది. ఆ అవయవాలను వేర్వేరు రోగులకు మార్పిడి చేశారు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి.. అవయవాలను సమయానికి పంపిణీ చేశారు.

శక్తికుమార్ కిడ్నీ, కాలేయాన్ని అదే ఆస్పత్రిలో చేరిన రోగులకు అమర్చగా, రెండో కిడ్నీని తిరుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రోగికి అమర్చనున్నట్లు వైద్యులు తెలిపారు. అదే సమయంలో గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇందుకోసం అవయవాలను గడువులోగా అవయవాలు అమర్చేందుకు వీలుగా నగర పోలీసులు గ్రీన్ కారిడార్ ను నిర్మించారు.