Asianet News TeluguAsianet News Telugu

ఇరాన్ లో చిక్కుకున్న 22 మంది భారతీయులు: ప్రభుత్వానికి మొర

కరోనావైరస్ భూతం ఇరాన్ ను వణికిస్తోంది. ఈ స్థితిలో 22 మంది భారతీయులు ఇరాన్ లోని హోటల్లో చిక్కుపడ్డారు. తమకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

22 Indians, stuck in Coronavirus-hit Iran
Author
Iran, First Published Mar 8, 2020, 8:15 PM IST

న్యూఢిల్లీ: ఇరాన్ లో కనీసం 22 మంది చిక్కుకున్నారు. ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తమను ఇండియాకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు ఆదివారం భారత ప్రభుత్వాన్ని కోరారు. ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేసే 22 మంది భారత పౌరులు ఇరాన్ లోని బుషేర్ హోటల్లో చిక్కుపడ్డారు. 

వారిలో వివిధ రాష్ట్రాలకు చెందినవారున్నారు. జమ్మూ, కేరళ, తమిళనాడులకు చెందిన పౌరులు కూడా వారిలో ఉన్నారు. తాము ఇరాన్ లోని బుషేర్ లో చిక్కుపడ్డామని, తమను రక్షించడానికి సాయం చేయాలని, విమానాలు రద్దు కావడం వల్ల తాము తిరిగి రాలేకపోతున్నామని వారన్నారు. 

తాము భారత ఎంబసీ బండారు అబ్బాస్ కు సమాచారం అందించామని, కానీ ఏ విధమైన సమాధానం రాలేదని వారిలోని ఓ వ్యక్తి ప్రకటించాడు. ఇరాన్ లో ఉన్నవారిని తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్టన్లు మార్చి 6వ తేీదన ఆరోగ్య శఆఖ మంత్రి చెప్పారు. 

కరోనా వైరస్ వల్ల 49 మంది మరణించినట్లు, గత 24 గంటల్లో 1,076 కొత్త కేసులు నమోదయ్యాయయని, దాంతో మరణాల సంఖ్య 194కు చేరుకుందని శనివారంనాడు ఇరాన్ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios