ముంబై:టౌటే తుఫాన్  ఎఫెక్ట్ తో మహారాష్ట్రలోని ముంబై హై ప్రాంతంలో భారీ నౌకలు అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన ఘటనలో 22 మృతదేహాలను నేవీ సిబ్బంది బుధవారం నాడు తీరానికి తరలించారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తుఫాన్ ఉధృతికి ముంబై తీరంలో ఓఎన్‌జీసీ చమురుక్షేత్రం  వద్ద పి-305 అనే బారీ నౌక లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది.  అయితే తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో 260 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 

also read:టౌటే తుఫాన్: గుజరాత్‌లో ఏరియల్ సర్వే నిర్వహించిన మోడీ

నేవీ యుద్దనౌక ఐఎన్ఎస్ కొచ్చి బుధవారం నాడు మృతదేహాలను  ముంబై తీరానికి తీసుకొచ్చాయి. ఐఎన్ఎస్ టెగ్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ బియాన్, పీ8ఐ విమానం హెలికాప్టర్లు  గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బార్జ్ జిఎఎల్ కన్‌స్ట్రక్షర్ లో ఉన్న 137 మంది సిబ్బందిని  నేవీ సిబ్బంది రక్షించారు. ఈ నౌకలో 185 మంది నౌకదళ సిబ్బందిని గుర్తించి రక్షించారు. మిగిలినవారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం నాడు సాయంత్రం పీ-305 సహా మూడు బార్జ్ లు , ఒక ఆయిల్ రిగ్ కొట్టుకుపోయాయి.