Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్ లో కిచిడీ తిని 21 మందికి అస్వస్థత...

ఉత్తరప్రదేశ్లో 21 మంది ఫుడ్‌ పాయిజన్‌తో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారి తెలిపారు.

21 Fall Ill After Eating Khichdi In uttarpradesh - bsb
Author
First Published Mar 27, 2023, 11:57 AM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని 'భండారా'లో వడ్డించిన ఖిచ్డీ (గంజి) తిని పిల్లలతో సహా 21 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం ఫైజ్‌పూర్ నినానాలో ఈ ఘటన జరిగిందని జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) రాజ్‌కమల్ యాదవ్ తెలిపారు.

ఫుడ్ పాయిజన్ కావడంతో 21 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పిల్లల బాగోగులు చూసేందుకు ఇద్దరు శిశువైద్యులు విధులు నిర్వహిస్తున్నారని, పిల్లలు, పెద్దలు క్షేమంగా ఉన్నారని డీఎం తెలిపారు. గ్రామంలో ఎవరికైనా అస్వస్థతకు గురైతే ఆసుపత్రిలో చేర్పిస్తామని ప్రకటించారు.

నల్ల దుస్తుల్లో పార్లమెంట్‌కు కాంగ్రెస్ ఎంపీలు.. ప్రారంభమైన నిమిషాల్లోనే వాయిదా పడిన ఉభయ సభలు..

ఇదిలా ఉండగా, గతవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ హోటల్లో ఆహారం తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు.  దీంతో స్థానికంగా కలకలం రేగింది. బుధవారం రాత్రి హైదరాబాద్ సనత్ నగర్ లోని మాషా అల్లా అనే హోటల్లో బిర్యానీ తినడానికి కొంతమంది వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో మటన్ బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిహెచ్ఎంసి ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రేణుకలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్లో తనిఖీలు చేపట్టారు.

అస్వస్థతకు సంబంధించిన ఫిర్యాదు మేరకు హోటల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు.. వాటి శాంపిలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాషా అల్లా హోటలను సీజ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం హోటల్లో సేకరించిన ఆహార పదార్థాల శాంతిలను పరీక్ష నిమిత్తం పంపించామని..  వాటిలో ఏమైనా లోపాలు ఉన్నట్లుగా తేలితే నిర్వాహకులపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక బుధవారం రాత్రి ఈ హోటల్లో ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన 12 మందిలో ఆరుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  మరో ఆరుగురికి చికిత్స కొనసాగుతోంది. 

కాగా,  నాలుగు రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లోని ఓ మండి హోటల్లో బిర్యానీ తిన్న కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. సీతారాంపూర్ గ్రామానికి చెందిన పవన్, అరవింద్,  మహేందర్ అనే ముగ్గురు స్నేహితులు 18వ తేదీ రాత్రి ఇక్కడినుంచి బిర్యానీ పార్సిల్ తీసుకువెళ్లారు. అదే రోజు నర్సాపూర్ కే చెందిన అజీజ్ అనే వ్యక్తి మరో ఆరుగురు స్నేహితులతో కలిసి అదే మండి హోటల్ కు వచ్చి ఆహారం తిన్నాడు.  ఇలా తిన్న వీరందరూ అస్వస్థతకు గురై గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరారు. నర్సాపూర్ కే చెందిన మహేష్, షకీల్, నాని కూడా అదే రోజు రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో నర్సాపూర్ లోని మన్నత్ అరేబియన్ హోట్ నుంచి శాంపిల్స్ సేకరించినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత తెలిపారు .

Follow Us:
Download App:
  • android
  • ios