బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. పోరూర్‌లోని ఓ పార్కింగ్ ప్రదేశంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 200 కార్లు కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 5 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, అగ్నికీలల్లో కొంతమంది వ్యక్తులు చిక్కుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.