ముంబై: ఓ మహిళా ప్రయాణికురాలు మహారాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్ లో పండంటి బిడ్డను కన్నది. కొంకణ్ కన్య ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల మహిళ మహిళ ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. 

థానే రైల్వే స్టేషన్ లోని ఒన్ రూపీ క్లినిక్ అధికారులు ఆమెకు పురుడు పోశారు. తల్లి, పాప, సహాయం అందిస్తున్న నర్సు ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

ఒన్ రూపీ క్లినిక్ అధికారులను ట్విట్టర్ లో ప్రజలు అభినందిస్తున్నారు. స్టేషన్ ప్రాంతాల్లో ఈ ఒన్ రూపీ క్లినిక్స్ ఇటువంటి అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతున్నాయి. 

ఇటువంటి సంఘటన ఇది మొదటిది కాదు. గతంలో ఏప్రిల్ 7వ తేదీన కుర్లాకు వెళ్తున్న సమయంలో ఓ మహిళ థానే రైల్వే స్టేషన్ లో బాబుకు జన్ననిచ్చింది.