భోపాల్‌లోని సుభాష్ నగర్‌లో 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి పెళ్లి సాకుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు శనివారం ఐష్‌బాగ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్ : Bhopalలోని సుభాష్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ 20 యేళ్ల యువతికి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి molestationకి పాల్పడ్డాడు, ఆ తర్వాత విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు శనివారం ఐష్‌బాగ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనపై rape చేసిన నిందితుడు తన తండ్రి దుకాణంలో పని చేస్తున్నాడని... ఈ క్రమంలో తనతో పరిచయం పెంచుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 

ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. నిందితులు ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే నిందితుడు 2021 డిసెంబర్‌లో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరుతూ తనకు ఫోన్ చేశాడని బాలిక ఆరోపించింది. అయితే పెళ్లికి ముందు ఇలా చేయడం తనకు ఇష్టం లేదని ఆమె అతని అభ్యర్థనను తోసి పుచ్చింది. దీంతో అతను ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు.

ఆ తరువాత పెళ్లి విషయం మాట్లాడదాం.. చేసుకుంటానని చెప్పి బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి అక్కడ నిందితుడు మళ్లీ తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంపై బాధితురాలు కొంతకాలం మౌనంగా ఉంది. చివరకు ధైర్యం చేసి బాధితురాలు శనివారం ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించింది, దాని ఆధారంగా కేసు నమోదు చేయబడింది.

ఇదిలా ఉండగా, తెలంగాణలోని హైదరాబాద్ లో గతనెల ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికిన ఓ ప్రబుద్ధుడు (23) నమ్మి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చైతన్యపురి ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ గా నమోదై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన ఓ యువతి (19) నాలుగేళ్లుగా దిల్సుఖ్ నగర్ సమీపంలోని చైతన్యపురి కాలనీలో టెలీకాలర్ గా పనిచేస్తుంది.

ఈనెల 7న తననుతాను సిద్ధార్థ రెడ్డిగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, రూ. 18 వేల వేతనం చెల్లిస్తానని నమ్మబలికాడు. టెలీకాలర్ సంస్థ నుంచి తన ఫోన్ నెంబర్ సేకరించినట్లు చెప్పాడు. 9న కారులో దిల్షుక్నగర్ కు వచ్చి యువతిని తన వెంట తీసుకుని ఎర్రగడ్డకు వచ్చాడు. మార్గమధ్యలో యువతి ఫోటోలు, గుర్తింపు కార్డు పత్రాలు తీసుకున్నాడు. ఎస్ఆర్ నగర్ లోని Oyo లాడ్జ్ కి తీసుకెళ్లి యువతి పేరిట గది బుక్ చేశాడు. 

ఉద్యోగం గురించి ప్రశ్నిస్తే రాత్రి భోజనం చేసిన తరువాత అడ్వాన్స్ చెల్లిస్తానని నమ్మబలికాడు. లాడ్జి గదిలోకి వెళ్ళిన తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు విషయం ఎవరికైనా చెబితే ఫోటోలు మీడియాకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలు అక్కడినుంచి ఎలాగో తప్పించుకొని వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్సార్ నగర్ ఠాణాకు బదిలీ చేశారు.