‘లఖ్ నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించాం’ అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు.
ముంబయి : ముంబైలోని సోను సూద్ కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ నిన్న అర్థరాత్రి ముగిశాయి. సోనూసూద్ కి సంబంధించిన ఆరు ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 20 గంటల పాటు శోధించారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
"సోనూ సూద్ కంపెనీ, లక్నో ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ మధ్య ఇటీవలి ఒప్పందం పరిశీలనలో ఉంది. ఈ ఒప్పందంపై పన్ను ఎగవేత ఆరోపణలపై సర్వే ఆపరేషన్ ప్రారంభించబడింది" అని వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ దాడులు సోనూసూద్ మీద కావాలని చేస్తున్నారని ప్రతిపక్ష రాజకీయ నాయకులు అంటున్నారు.
కరోనా టైంలో రియల్ హీరోగా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసం, కార్యాలయాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్ నవూ నగరాల్లోని సూద్ కు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపామని అధికారులు తెలిపారు.
‘లఖ్ నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించాం’ అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఇటీవల సోనూసేద్.. ఢిల్లీ ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.
ఇండియాలో గత 24 గంటల్లో 30,570 కొత్త కరోనా కేసులు: కేరళలోనే 17,681 కేసులు
సీఎం కేజ్రీవాల్ ను కూడా కలిశారు. ఆ సమయంలో ఆప్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై ఆప్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సోనూసూద కు మద్దతుగా నిలిచింది. కరోనా సమయంలో లక్షలాది కుటుంబాలకు సూద్ సాయం చేశారని, వారంతా ఆయన కోసం ప్రార్థిస్తారని, ఈ కష్టకాలంలో మద్ధతుగా నిలుస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ తో సమావేశమైనందుకే ఈ దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను భాజాపా ఖండించింది.
తన దాతృత్వానికి రాజకీయాలతో సంబంధం లేదని సోనూసూద్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. అయితే కేజ్రీవాల్‌తో ఆయన సమావేశం తరువాత సోనూసూద్ రాజకీయ ప్రవేశం గురించి పుకార్లు పుట్టించింది. బహుశా వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని అనుకుంటున్నారు.
ఈ దాడులకు కేజ్రీవాల్ మీటింగ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఎవరు, ఎవరితోనైనా కలవచ్చు. స్వచ్ఛంద సంస్థల మీద ఐటీ దాడులు మామూలే అంటూ చెప్పుకొచ్చారు. ఆదాయపు పన్ను శాఖ అనేది ఒక స్వతంత్ర విభాగం, దానికి స్వీయ ప్రోటోకాల్ ఉంది. అది తన పని తాను చేస్తోంది "అని బిజెపి అధికార ప్రతినిధి ఆసిఫ్ భమ్లా అన్నారు.
