Asianet News TeluguAsianet News Telugu

చెన్నైలో భారీ చోరీ.. బ్యాంక్‌లో రూ.20 కోట్ల అపహరణ, ఇంటి దొంగల పనిగా అనుమానం

తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.20 కోట్ల విలువైన బంగారం, నగదు దోచుకెళ్లారు దుండగులు.

20 crores stolen from chennai fed bank
Author
Chennai, First Published Aug 13, 2022, 8:35 PM IST

తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.20 కోట్ల విలువైన బంగారం, నగదు దోచుకెళ్లారు దుండగులు. చెన్నై నగరం అరుంబాక్కంలోని ఫెడ్ జ్యూయలరీ లోన్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. ఇది ఇంటి దొంగల పనిగానే తెలుస్తోంది. మొత్తం ముగ్గురు వ్యక్తులు .. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి సెక్యూరిటీ గార్డు, సిబ్బందిని కట్టేసి రూ.20 కోట్ల విలువైన ఆభరణాలు, నగదును అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ కమీషనర్, డిప్యూటీ కమీషనర్ నేరుగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios