సుమారు 110 గంటల పాటు శ్రమించి బోరుబావిలో పడిన బాలుడిని బయటకు వెలికి తీశారు.అయితే బోరుబావిలోనే బాలుడు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.
న్యూఢిల్లీ:సుమారు 110 గంటల పాటు శ్రమించి బోరుబావిలో పడిన బాలుడిని బయటకు వెలికి తీశారు.అయితే బోరుబావిలోనే బాలుడు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.
ఈ నెల 6వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫతేవీర్ సింగ్ బోర్‌బావిలో పడిపోయాడు. పంజాబ్ రాష్ట్రంలోని సంగూరు జిల్లా భగవాన్‌పుర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
తన ఇంటికి సమీపంలో ఆడుకొంటున్న సమయంలోనే బోర్ బావిలో ఫతేవీర్ సింగ్ పడిపోయాడు. 7 ఇంచుల బోర్ బావిపై ఓ గుడ్డను కప్పారు. అయితే ప్రమాదవశాత్తు బాలుడు ఆ బోర్ బావిలో పడిపోయాడు. అయితే ఈ బాలుడు బోర్ బావిలో పడగానే అతని తల్లి బాలుడిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, సాధ్యం కాలేదు.
సుమారు ఐదు రోజుల పాటు అదికారులు బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు ఉదయం ఐదున్నర గంటల సమయంలో బాలుడిని అధికారులు రక్షించారు.
బోర్ బావిలోని 125 అడుగుల లోతులో బాలుడు చిక్కుకొన్నాడు. ఈ బోర్ బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి మంగళవారం నాడు ఉదయం బాలుడిని బయటకు తీశారు.ఐదు రోజుల పాటు బాలుడికి ఆహారం లేదు. కానీ ఆక్సిజన్ మాత్రం అందించారు. 110 గంటల పాటు అధికారులు శ్రమించినా కూడ బాలుడు బతకకపోవడంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
