ఓ మెడికల్ స్టోర్ నిర్వాకం వల్ల రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జ్వరంతో బాధపడుతున్న చిన్నారికి తల్లి.. మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకువచ్చి వేసింది. ఆ మందులకు జ్వరం తగ్గకపోగా... చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాదకర సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఢిల్లీలోని షాహదారా జీటీబీ ఎన్ క్లేవ్ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. దీంతో చిన్నారి తల్లి... పక్కనే ఉన్న మెడికల్ స్టోర్ కి వెళ్లి.. మందులు తీసుకువచ్చింది. ఆ మందులను చిన్నారికి వేసింది. అయితే... చిన్నారికి జ్వరంగా తగ్గకపోగా.. మరింత పెరిగింది.

దీంతో... చిన్నారి తల్లి మరోసారి ఆ మెడికల్ స్టోర్ కి వెళ్లింది. అయితే... ఆ మెడికల్ స్టోర్ వ్యక్తి ఆమెకు ఈసారి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ చిన్నారికి చేయించారు. ఆ ఇంజెక్షన్ చేసిన కాసేపటికే చిన్నారి రక్తపు వాంతులు చేసుకొని చనిపోయింది.

వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అప్పటికే చనిపోయిందని వైద్యులు తేల్చిచెప్పారు. కాగా... ఈ ఘటనపై గందరగోళం నెలకొంది. మెడికల్ స్టోర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.