ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. ఎంతమంది చిన్నారులు బలవుతున్నా ఇప్పటికీ జనంలో బోరుబావుల విషయంలో మార్పు రావడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సింగ్రౌలి జిల్లా కెర్హార్ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలిక పొలంలో ఆడుకుంటోంది.

ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న 70 అడుగుల బోరుబావిలో పడిపోయింది. వెంటనే దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు చిన్నారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.