Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దారుణం.. ఇంటికి తాళం, ఇంట్లో రెండు శవాలు... పిల్లలు వచ్చి చూసేసరికి...

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వారి పిల్లలు వచ్చి చూశాక విషయం వెలుగులోకి వచ్చింది. 

2 Women Murdered At Home, Children Find Bodies In Delhi
Author
Hyderabad, First Published Aug 16, 2022, 2:00 PM IST

న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో సోమవారం ఇద్దరు మహిళలు తమ ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. బాధితులను షహదారాలోని సుభాష్ పార్క్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల విమ్లా దేవి, ఆమె 45 ఏళ్ల కోడలు డోలి రాయ్‌గా గుర్తించారు. అయితే, హత్య జరిగినప్పుడు విమ్లా దేవి కుమారులు సార్థక్ రాయ్, శశాంక్ రాయ్ ఇద్దరూ ఢిల్లీలో లేరు. ఏదో పనిమీద వారు వేరే ఊరు వెళ్లారు. 

పని ముగించుకుని వారు తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి కనిపించింది. తమ వద్ద ఉన్న స్పేర్ కీతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన వారు షాక్ అయ్యారు. ఇంట్లో వారి తల్లి, అమ్మమ్మ నేలపై చనిపోయి పడి ఉన్నారు. వారి పెంపుడు కుక్కను ఒక మూలకు కట్టివేసి ఉంది. దీంతె వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 

మంగళవారం తెల్లవారుజామున 4.20 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం హంతకులను పట్టుకునేందుకు విచారణ జరుపుతోంది. ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు కత్తిపోట్లే కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

యూపీలో ఘోర ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి

ఇదిలా ఉండగా, వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించారో, ఒప్పించారో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ముద్దులొలికే చిన్నారులూ ఉన్నారు. కానీ కాలం గడిచేకొద్దీ వారి మధ్య ప్రేమ ఆవిరైపోయి, ద్వేషం రగిలింది. ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేంతగా ప్రేమించుకున్నవారే... ప్రాణాలు తీసుకునేలా తయారయ్యారు. కరీంనగర్ లో ఇలాంటి దారుణ ఘటనే స్వాతంత్ర్య దినోత్సవ వేళ విషాదాన్ని నింపింది. 

జాతీయ జెండా సాక్షిగా భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్, కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన శిరీష (30) 11యేళ్ల కిందట ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు. వీరికి 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శిరీష నాలుగేళ్లుగా అంగన్వాడిలో ఆయాగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబకలహాలు జరుగుతున్నాయి. దీంతో శిరీష భర్తకు దూరంగా కేశవపట్నంలోనే ఉంటుంది. విడాకుల కోసం భర్తకు నోటీసులు పంపించింది.

సోమవారం అంగన్వాడీ కేంద్రం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణలో ఆమె పాల్గొంది. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి ప్రవీణ్ వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకు వెళ్ళాడు. జనం అంతా చూస్తూ ఉండగానే కత్తితో గొంతు కోయడంతో.. ఆమె ఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచింది. కుమార్ అనే యువకుడు అడ్డుకోగా.. అతడిని కూడా కత్తితో పొడిచాడు. దీంతో అతడికి  చిన్న గాయం అయ్యింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో… వారు అక్కడికి చేరుకునేసరికే నిందితుడు పరారీలో ఉన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios