దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద డ్రోన్ కలకలం రేగింది. ఇద్దరు అమెరికన్లు... రాష్ట్రపతి భవన్ వద్ద డ్రోన్ ఎగుర వేశారు. ఆ ఇద్దరు అమెరికన్ యువకులు డ్రోన్ సహాయంతో సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్ ప్రాంతాల్లోని హై సెక్యురిటీ జోన్ లో వీడియోలు చిత్రీకరించారు. కాగా... వారి వ్యవహారం అనుమానం కలిగించడంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

రాజధాని నగరమైన ఢిల్లీలో డ్రోన్ ఎగురవేయడం నిషేధం. నిషేధ ఉత్వర్వులను ఉల్లంఘించి ఇద్దరు అమెరికా పౌరులు హై సెక్యురిటీ ప్రాంతంలో ఫోటోలు, వీడియోలు తీశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఇద్దరు అమెరికన్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ ఇద్దరు యువకులు డ్రోన్ ఎందుకు ఎగురవేశారనే విషయం తెలియాల్సి ఉంది.