కేరళలో తలపడిన రెండు ఏనుగులు: భయంతో జనం పరుగులు
కేరళ రాష్ట్రంలోని ఓ ఆలయంలో రెండు ఏనుగులు ఘర్షణకు దిగాయి. అయితే ఎలిఫెంట్ స్క్వాడ్ సకాలంలో రంగంలోకి దిగి ఏనుగులను బంధించాయి.
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో రెండు ఏనుగులు పరస్పరం దాడులకు దిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కేరళ రాష్ట్రంలోని ఆరట్టుపుజ ఆలయంలో సంప్రదాయ పూజల సమయంలో రెండు ఏనుగులు తలబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆలయంలో ప్రత్యేక పూజల సందర్భంగా రెండు ఏనుగులను అలంకరించారు. అయితే ఈ ఏనుగులు రెండు తలపడ్డాయి.ఘర్షణ పడుతున్న రెండు ఏనుగులను విడదీసేందుకు మావటిలు ప్రయత్నించారు. రెండు ఏనుగులు ఘర్షణ పడుతున్న దృశ్యాలను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
అరట్టుపుజ ఆలయంలో ఆరాట్ ఆచార ఊరేగింపు సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయ ఊరేగింపులో ఆలయ ప్రధాన ఏనుగు గురువాయూర్ రవికృష్ణన్, మరో ఏనుగు శ్రీకుమారన్ తో ఘర్షణకు దిగింది. రెండు ఏనుగుల ఘర్షణను చూసిన స్థానికులు భయంతో అక్కడి నుండి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎలిఫెంట్ స్క్వాడ్ సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఘర్షణలకు దిగిన రెండు ఏనుగులను బంధించారు.