Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్‌స్టర్‌గా మారిన డ్యాన్స్ టీచర్.. రూ.30 లక్షలు ఇవ్వకుంటే.. పిల్లలను చంపుతామని బెదిరింపులు.. కట్ చేస్తే..

తమ పిల్లలను చంపుతామని బెదిరించి ఒక కుటుంబం నుండి ₹ 30 లక్షలు దోపిడీ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితులు డ్యాన్స్ టీచర్స్ గా గుర్తించారు. 

2 Try To Extort Money From Family By Threatening To Kill Children, Arrested
Author
First Published Dec 24, 2022, 11:49 PM IST

తన పిల్లలను చంపేస్తామని బెదిరించి ఓ వ్యాపార వేత్త నుండి లక్షల్లో డబ్బు గుంజాలని గ్యాంగ్‌స్టర్‌గా మారిన డ్యాన్స్ టీచర్ రూపొందించిన పథకం బెడిసికొట్టింది. వ్యాపార వేత్త  పోలీసులను ఆశ్రయించటంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన యూపీలోని గౌతమ్ బుద్ నగర్ చోటుచేసుంది. బాధిత కుటుంబం ఆనంద్ విహార్‌లోని దయానంద్ విహార్‌లో నివసిస్తుందని క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.

బాధితులు వ్యాపారవేత్త. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతనికి గాంధీ నగర్ ప్రాంతంలో గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. కాగా.. డిసెంబర్ 20న తన వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిందని బాధితుడు చెప్పాడు. ఆ మెసేజ్‌లో నిందితుడు తనను తాను గ్యాంగ్‌స్టర్‌గా పరిచయం చేసుకుని..ఆ  వ్యాపారి కొడుకు,కూతురి ఫోటోలను క్రాస్ చేసి పంపాడు. అనంతరం నిందితుడు..  వ్యాపారవేత్తకు ఫోన్ చేశారు. భయంతో వ్యాపారవేత్త కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసి నంబర్‌ను బ్లాక్ చేశాడు. మరో 10 నిమిషాల తర్వాత నిందితుడు వ్యాపారి భార్య మొబైల్‌కు ఇదే సందేశాన్ని పంపాడు.

దీనిపై కూడా పిల్లల క్రాస్ ఫొటోలు పంపడమే కాకుండా డిసెంబర్ 24న చిన్నారులను చంపేస్తామని బెదిరించారు. వ్యాపారి భార్య కూడా కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసి నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో భార్య వ్యాపారికి సమాచారం అందించింది. అనంతరం వ్యాపారి తన స్నేహితుడి మొబైల్‌ నుంచి నిందితుడికి కాల్‌ చేసేందుకు ప్రయత్నించగా ఫోన్‌ ఎత్తలేదు. అనంతరం నిందితులు స్వయంగా ఫోన్ చేసి పిల్లలకు బదులుగా వ్యాపార వేత్త నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు.

ఈ ఉత్కంఠ సమయంలో వ్యాపారి తన స్నేహితుడి సూచన మేరకు ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక పోలీసులతో పాటు క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు అరుణ్ సింధు, కెకె శర్మ తదితరులతో కూడిన బృందం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు సాంకేతిక నిఘా సహాయంతో నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. నిందితుల ఆధారాలతో గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, యమునాపర్‌లో దాడులు నిర్వహించారు.

గౌతమ్‌బుద్‌ నగర్‌కు చెందిన నిందితుడు విష్ణు ను, ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్‌కు చెందిన నిందితుడు దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఒప్పుకున్నారు. తూర్పు ఢిల్లీలోని చాలా మంది వ్యాపారవేత్తల పిల్లలకు తాను డ్యాన్స్ నేర్పిస్తానని నిందితుడు విష్ణు చెప్పాడు. బాధిత వ్యాపారి భయపడి డబ్బులు ఇస్తారని తాము భావించామని నిందితులు తెలిపారు.అందుకే డబ్బులు అడగాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios