జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. శ్రీనగర్‌లో గురువారం ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు.  శ్రీనగర్ శివారులోని హెచ్‌ఎంటి వద్ద ఈ ఘటన జరిగింది.  ఇండియన్ ఆర్మీ రోడ్ ఓపెనింగ్ పార్టీ (ఆర్‌ఒపి) పై ఉగ్రవాదులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. 

ఈ దాడిపై  సమాచారం అందుకున్న సిఆర్‌ఎపిఎఫ్‌ బలగాలు, జమ్మూకాశ్మీర్‌ ఎస్‌ఒసి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలయరాలేదు.  26/11 ముంబయి ఉగ్రవాద దాడి జరిగి గురువారంతో పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌ లో సైనికులపై ఉగ్రవాదులు దాడులు జరపడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ నెల 28, డిసెంబర్ 22 మధ్య డిసిసి ఎన్నికలు జరగునన్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో హైఅలర్ట్ ప్రకటించారు.