జార్ఖండ్ రాష్ట్రంలోని  ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ఒకరిపై మరోకరు కాల్పులు జరుపుకొన్నారు


న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలోని ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ఒకరిపై మరోకరు కాల్పులు జరుపుకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ కూడ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని ఆర్మ్‌డ్‌పోర్స్‌‌లోని నాలుగవ బెటాలియన్‌కు చెందినవారు.

సోమవారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు కాలేగాన్ లోని మేఘా స్పోర్ట్స్ స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకొంది. వీరిద్దరూ కూడ చత్తీస్‌ఘడ్ నాలుగవ బెటాలియన్ బి కంపెనీకి చెందినవారు. 

అయితే ఈ ఇద్దరూ ఎందుకు ఒకరిపై మరోకరు కాల్పులకు పాల్పడ్డారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెప్పారు. మృతి చెందిన ఇద్దరిని విక్రమ్ రాజ్‌వాడే, మేలా రామ్ కూనేగా గుర్తించారు.

ఇదే తరహా ఘటన వారం రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీష్‌ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకొంది. జవాన్లపై తోటి జవానే కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటన చోటు చేసుకొంది.

తోటి జవాన్లతో వాగ్వాదం కారణంగా ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ మసుదూల్ రహ్మన్ తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు.