Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్‌ నుండి బంగారం తరలింపు, చెన్నైలో ఇద్దరి అరెస్ట్: గోల్డ్ ఎక్కడ దాచారంటే..

అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణీకులను చెన్నైలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుండి 1.42 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారం విలువ రూ. 85 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

2 Passengers Hide Gold Paste In Rectum, Caught At Chennai Airport lns
Author
Chennai, First Published Jan 14, 2021, 11:26 AM IST


చెన్నై: అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణీకులను చెన్నైలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుండి 1.42 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారం విలువ రూ. 85 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

 రూ.72.6 లక్షల విలువైన 1.42 కిలోల బంగారంతో పాటు  రూ.12.4 లక్షల విలువైన సిగరెట్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకొన్నామని కస్టమ్స్ అధికారులు చెప్పారు.దుబాయ్ నుండి 6ఈ8246 నెంబర్ గల విమానంలో ఈ ఇద్దరు ప్రయాణీకులు చెన్నైకి చేరుకొన్నారు. ఈ ఇద్దరు నిందితులు పురుషనాళంలో బంగారం పేస్ట్ ను దాచిపెట్టారు. 

నిందితుల లగేజీలో ఇతర వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా కస్టమ్స్ అధికారులు ప్రకటించారు.దేశంలోని పలు విమానాశ్రయాల్లో విదేశాల నుండి అక్రమంగా బంగారం తరలిస్తూ పలువురు అరెస్టైన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకొన్నాయి. 

బంగారం తరలింపు కోసం స్మగ్లర్లు రకరకాల మార్గాలను ఎంచుకొంటున్నారు. ఈ ఇద్దరు నిందితులు పురుషనాళంలో బంగారం పేస్ట్ ను ఉంచుకొని ఇండియాకు వచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios