రెండు వారాల లాక్ డౌన్ పొడిగింపు,కొన్ని రంగాలకు మినహాయింపులు!

ప్రధాని కూడా మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఆర్థికంగా దేశంపై పడే భారాన్ని కూడా అంచనా వేసి ఆయన ఒక నిర్ణయం తీసుకోనున్నారు. 

2 More Weeks Of COVID-19 Lockdown,cm's pitch in the idea and Modi agreed

కరోనా మహమ్మారిని భారతదేశంలో వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు నేటి ఉదయం ప్రధాని మనరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. 

దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని కోరారు. దేశం మొత్తంలో లాక్ డౌన్ ఉన్నప్పుడే అది సమర్థవంతంగా ఉంటుందని, రాష్ట్రాలకు వదిలేస్తే దాని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. 

ప్రధాని కూడా మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఆర్థికంగా దేశంపై పడే భారాన్ని కూడా అంచనా వేసి ఆయన ఒక నిర్ణయం తీసుకోనున్నారు. 

ప్రధాని ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ని పొడిగించడానికి నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ స్పష్టం చేసారు. కాబట్టి నేటి సాయంత్రం అధికారికంగా ఈ విషయమై ప్రకటన వెలుబువ్వడే ఆస్కారం ఉంది. 

కాకపోతే ఇప్పుడు పొడిగించనున్న రెండు వారల లాక్ డౌన్ లో కొన్ని వర్గాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చే ఆస్కారం ఉన్నట్టు తెలియవస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, తేయాకు పరిశ్రమ, నిర్మాణ రంగాలకు సంబంధించి ఒక ప్రణాలికను విడుదల చేసే ఆస్కారం ఉన్నట్టు తెలియవస్తుంది. 

భారతదేశంలో గత 24 గంటల్లో వేయికి పైగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కొత్తగా 40 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం 7,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 239 మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ లో ఆ వివరాలను అందించింది.

దేశంలో లక్ష ఐసోలేషన్ బెడ్డ్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 171717 శాంపిల్స్ ను పరీక్షించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఒక్క రోజే 16500 మందిని పరీక్షించిట్లు ఆయన తెలిపారు. దేశంలో 536 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios