Asianet News TeluguAsianet News Telugu

పుల్వామాలో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ‌ ఉగ్రవాదులు..  బీహార్‌కు చెందిన వల‌స కూలీలకు గాయాలు 

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకపడ్డారు. శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు స్థానికేతరులు గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. 
 

2 Migrant Workers Injured After Terrorists Open Fire In Kashmir's Pulwama
Author
First Published Sep 24, 2022, 10:47 PM IST

జమ్మూ కశ్మీరులో శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పుల్వామా జిల్లాలో పౌరుల లక్ష్యంగా కాల్పులు జరిపారు.  జిల్లాలోని రత్నిపోరాలో జరిగిన కాల్పుల్లో బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న స్థలానికి చేరుకుని.. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. గాయపడిన కూలీలిద్దరూ బీహార్‌లోని బెట్టియా జిల్లా వాసులు అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిని బీహార్‌లోని బెట్టియా జిల్లాకు చెందిన షంషాద్, ఫైజాన్ కస్రీగా గుర్తించారు. 

మరోవైపు ఉగ్రవాదుల ఘటన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆ ప్రాంతమంతా ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పుల్వామా జిల్లాలో శనివారం ఇద్దరు స్థానికేతర కూలీలను కాల్చి చంపినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. పుల్వామాలోని ఖర్పోరా రత్నిపోరాలో ఉగ్రవాదులు ఇద్దరు ఇతర రాష్టానికి చెందిన కార్మికులు కాల్పుల్లో గాయపడ్డారని  కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

  
ఆగస్టు 5న పుల్వామాలోని గదూరా ప్రాంతంలో బయటి కూలీలపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ ఉగ్రదాడిలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో బాధితుడు బీహార్‌కు చెందిన కార్మికుడు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పలుమార్లు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios