విద్యుత్ సరఫరాలో లోపం: కోవిడ్ ఆసుపత్రిలో ఇద్దరి మృతి
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ కోవిడ్ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు మరణించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఆక్సిజన్ అందక రోగులు మరణించినట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ కోవిడ్ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు మరణించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఆక్సిజన్ అందక రోగులు మరణించినట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట మంగళవారం నాడు ధర్నాకు దిగారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా ఆక్సిజన్ అందక తమ బంధువులు మరణించారని నిరసనకారులు ఆరోపించారు.కరోనా చికిత్స కోసం కోవిడ్ ఆసుపత్రిలో చేరిన రోగుల్లో సుమారు 40 మందికి ఆక్సిజన్ అందిస్తూ చికిత్స అందిస్తున్నారు.
ఈ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న ఇద్దరు రోగులు ఊపరి ఆడక మరణించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆక్సిజన్ అందలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుల బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసనకు దిగారు.
ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు నిరసనకారులతో చర్చించారు. ఆసుపత్రికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎలా జరిగిందని నిరసకారులు ప్రశ్నించారు.
ఆసుపత్రి ఆవరణలో నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ వైరు తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టుగా అధికారులు గుర్తించారు. నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు.