బ్రిడ్జి మీద బైక్ తో స్టంట్ ట్రై చేసి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇటీవల ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా సిగ్నేచర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ బ్రిడ్జ్ పై  ఇద్దరు మెడికల్ విద్యార్థులు బైక్ పై వేగంగా వెళుతూ ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు.

దీంతో.. బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ ఢీకొట్టింది. దీంతో.. వారు 30 అడుగుల లోతులో పడిపోయి.. అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు సత్య విజయ్ శంకరన్, చంద్రశేఖర్ లుగా గుర్తించారు. వీరిరువురు హిందూరావ్ మెడికల్ కాలేజీలో మెడిసిన్  చదువుతున్నారు. 

ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్ ని ఈ నెల 4వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. యమునా నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి మీద నుంచి ఢిల్లీ నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు.