Asianet News TeluguAsianet News Telugu

ఐఎస్ఐ ఏజెంట్లతో ఛాటింగ్, పెళ్లి వరకు వ్యవహారం.. ఇండోర్‌లో అక్కాచెల్లెళ్ల అరెస్ట్

పాకిస్థాన్‌కు రహస్య సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ గూడఛార సంస్థ ఐఎస్ఐకు చెందిన వ్యక్తులతో ఏడాది కాలంగా వారు స్నేహం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

2 Indore Sisters Arrested For Online Contacts With Suspected ISI Agents ksp
Author
Indore, First Published May 23, 2021, 3:48 PM IST

పాకిస్థాన్‌కు రహస్య సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ గూడఛార సంస్థ ఐఎస్ఐకు చెందిన వ్యక్తులతో ఏడాది కాలంగా వారు స్నేహం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ఇండోర్ లోని డాక్టర్ అంబేద్కర్ నగర్ (మహూ)కు చెందిన ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు విచారిస్తున్నారు. ఈ అక్కా చెల్లెళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి సోషల్ మీడియాలో.. ఐఎస్ఐకి చెందిన వారితో టచ్ లో ఉంటున్నారని తెలిపారు. వారి దగ్గర్నుంచి ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

పరిచయమైన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నానని అరెస్టయిన మహిళల్లో ఒకరు చెప్పారని అధికారులు అంటున్నారు. అక్కాచెల్లెళ్లలో అక్క అయిన మహిళ గత ఏడాది ఫేస్ బుక్ లో పాకిస్థాన్ వ్యక్తితో స్నేహం చేసిందని, అది వాట్సాప్ వరకు వచ్చిందని వివరించారు. ఒకొరికొకరు ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారని చెప్పారు. 

పెద్దమ్మాయి ఓ విద్యుత్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా, చిన్నమ్మాయి స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చిన్నమ్మాయి తరచూ ఆర్మీ ఉండే చోట బైక్ పై తిరిగేదని అధికారులు చెబుతున్నారు. కాగా, వారిద్దరి తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios