ఇద్దరు సెక్యురిటీ గార్డులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గార్డులపై కొందరు దాడి చేశారు. తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన అమిత్(22), సునీల్(24)లు శనివారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీ కి సంబంధించిన భవనం నిర్మాణంలో ఉండగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. వీరిపై అనుకోకుండా ఓ దుండగుల ముఠా వచ్చి దాడి చేసింది.

దారుణంగా కొట్టారు. కాగా.. ఈ ఇద్దరు సెక్యురిటీ గార్డుల అరుపులు విన్న ఇతర సెక్యురిటీ గార్డ్స్ వెంటనే అక్కడికి పరుగులు పెడుతూ వచ్చారు. వీరు రావడాన్ని గమనించి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాగా.. తీవ్ర రక్తస్రావమై పడి ఉన్న ఇద్దరు సెక్యురిటీ గార్డులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడి నుంచి వారిని మరో ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అయితే.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.

వీరిపై దాడి చేసిన వాళ్లు ఎవరూ అన్న విషయం తెలయలేదు. అసలు ఎందుకు దాడి చేశారో కూడా తెలయడం లేదు. కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.