నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని భివాండిలో శుక్రవారం అర్థరాత్రి నాలుగు అంతస్థుల భవం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బందిచర్యలు చేపడుతున్నారు.
 
కాగా ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో భవనంలో చీలకలు రావడాన్ని గుర్తించారు. ముందుగానే స్పందించిన మున్సిపల్ సిబ్బంది దాదాపు 22 కుటుంబాల తో ఇళ్లు ఖాళీ చేయించారు. కొందరు తమకు సంబంధించి వస్తువులను తీసుకొని బయటకు వస్తుండగా... భవనం పూర్తిగా కుప్పకూలింది. అధికారులు ముందుగా అప్రమత్తం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ భవాన్ని ఎమినిదేళ్ల క్రితం నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. సరైన ప్రమాణాలు పాటించకుండా భవనాన్ని నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.