లక్నో: భూ వివాదం విషయంలో జరిగిన ఘర్షణలో తండ్రీ కొడుకు మరణించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. రాష్ట్రంలోని ప్రతాప్ ఘడ్ జిల్లాలో చోటు చేసుకొంది. 

ఇవాళ ఉదయం భూ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.  భూ వివాదం పరిష్కరించేందుకు గాను గ్రామ పంచాయితీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి.

ఈ ఘటనలో ఓ వర్గానికి నాయకత్వం వహించిన దయాశంకర్ మిశ్రా ఆయన కొడుకు ఆనంద్ మిశ్రాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టుగా ప్రకటించారు.

ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారనే విషయమై ప్రత్యర్ధి వర్గానికి చెందిన రాజేష్ కుమార్ అతడి కొడుకు  రాజేష్ కుమార్ మిశ్రా ను కూడ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ అభిషేక్ సింగ్ చెప్పారు.

ఈ ఘర్షణను నిలువరించలేకపోయిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను కూడ ఎస్పీ తెలిపారు.ఈ ఘటనపై విచారణ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు,