ఇద్దరు యువతులపై రైల్లోనే అత్యాచారం, హత్య

2 arrested for rape-and-murder of women in trains
Highlights

అస్సాం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే టార్గెట్ గా ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడమే కాకుండా హత్యకు పాల్పడ్డారు.
 

అస్సాం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే టార్గెట్ గా ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడమే కాకుండా హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అసోం వ్యవసాయ యూనివర్సిటీలో చదువుతున్న ఓ 21 ఏళ్ల యువతి రైల్లో ఒంటరిగా ప్రయాణించడాన్ని ఇద్దరు దుండగులు గుర్తించారు. యువతికి తెలీకుండానే మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం యువతిపై అదే రైల్లో దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆ మృతదేహాన్ని రైళ్లోని టాయ్ లెట్ లో పడేసి రైలు దిగి పరారయ్యారు. ఈ మృతదేహాన్ని శివసాగర్ జిల్లాలోని సిమలుగురి రైల్వే స్టేషన్ లో రైల్వే సిబ్బంది గుర్తించారు.

 ఇదే నిందితులు మళ్లీ మరో మహిళపై కూడా ఇలాగే రైల్లోనే అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆ మృతదేహాన్ని శుక్రవారం సిబ్బంది జోర్హాత్ జిల్లా మరియాని స్టేషన్ లో  కనుగొన్నారు. వీరిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వికాస్ దాస్, విపిన్ పాండే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

మొదట రైల్లో ప్రయాణించే ఒంటరి మహిళలను గుర్తించి వారికి మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, అత్యాచారానికి పాల్పడువారిమని నిందితులు పోలీసులకు విచారణలో వెల్లడించారు. అత్యాచారం అనంతరం ఈ విషయం బైటపడకుండా హత్య చేసి రైల్లోని టాయ్ లెట్ల లో మఈతదేహాన్ని పడేసి పరారయ్యేవారమని నిందితులు విచారణ సందర్భంగా ఈ నేరం చేసినట్లు అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు.
 
 

loader