జ్ఞానవాపి ప్రాంగణంలో ప్రారంభమైన పూజలు: అలహాబాద్ హైకోర్టులో ముస్లింల పిటిషన్


జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని బేస్ మెంట్ ప్రాంతంలో  హిందువులు ప్రార్థనలు ప్రారంభించారు. 

1st Visuals of 'Puja' from Gyanvapi's 'Vyas Tehkhana', Muslim Side Reaches Allahabad HC After Nod to Prayers lns

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని బేస్ మెంట్ ప్రాంతంలో  హిందువులు ప్రార్థనలు చేసుకోనేందుకు
వారణాసి కోర్టు జనవరి  31న  అనుమతిని ఇచ్చింది.  అయితే దీంతో  గురువారం నాడు కోర్టు అనుమతించిన ప్రాంతంలో  హిందువులు పూజలు నిర్వహించేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు.  కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు , పిటిషనర్ ద్వారా ఒక పూజారిని కూడ ఎంపిక చేశారు.  1993 వరకు  ఈ ప్రాంతంలో హిందువులు పూజలు నిర్వహించినట్టుగా కాశీ విశ్వనాథ్ ట్రస్టు చెబుతుంది.

 

ప్రతి రోజు ఐదు సమయాల్లో హారతి ఇవ్వనున్నారు.  ప్రతి రోజూ తెల్లవారుజామున 03:30  గంటలకు  మంగ్లా నిర్వహిస్తారు.  మధ్యాహ్నం  12 గంటలకు భోగ్, సాయంత్రం నాలుగు గంటలకు  ఆర్పణ్, ఏడు గంటలకు  సన్యాకాల్, రాత్రి పదిన్నర గంటలకు  శాయన్ ను నిర్వహించనున్నరు.

also read:జ్ఞానవాపి కేసులో కీలక మలుపు: పూజలు చేసేందుకు హిందువులకు కోర్టు అనుమతి

మరో వైపు  కోర్టు ఆదేశాల నేపథ్యంలో  గురువారం నాడు జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని బేస్ మెంట్ వద్ద హిందువులు పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు  ప్రాంగణంలోని బేస్ మెంట్ లో హిందువులు పూజలు చేసుకొనేందుకు వారణాసి కోర్టు అనుమతించడాన్ని అంజుమాన్ ఇంతేజామియా మసీదు కమిటీ  అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది.ఈ మేరకు  పిటిషన్ దాఖలు చేసింది. 

జ్ఞానవాపి మసీదు  ప్రాంగణంలో  హిందువులు పూజలు చేసుకొనేందుకు  వారణాసి కోర్టు అనుమతివ్వడాన్ని సుప్రీంకోర్టులో అత్యవసరంగా విచారించాలని   మసీదు కమిటీ  పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు  సుప్రీంకోర్టు  తిరస్కరించింది. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించాలని  సుప్రీంకోర్టు సూచించింది. దరిమిలా అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి చెందిన  ప్రతినిధులు  పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో హిందువుల తరపున విష్ణు శంకర్ జైన్ వాదించారు.  వారణాసి కోర్టు ఆదేశాల మేరకు  రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం  పూజలు చేసేందుకు  ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. అంతేకాదు  రోజువారీ పూజలు కూడ ప్రారంభమయ్యాయన్నారు.

వ్యాస్ కా టేకానా లో పూజకు కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత  హిందువుల తరపు న్యాయవాది సోహన్ లాల్ ఆర్య స్పందించారు. ఈ తీర్పు అపూర్వమైందిగా పేర్కొన్నారు. ఈ తీర్పును విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. ముస్లిం తరపు న్యాయవాది ముంతాజ్ అహ్మద్  హైకోర్టులో  సవాల్ చేస్తామని  నిన్ననే ప్రకటించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios