1993లో ముంబై నగరాన్ని వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమెన్ మరణించాడు. శుక్రవారం గుండెపోటు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నాసిక్ జైలు అధికారులు తెలిపారు. 

1993లో ముంబై నగరాన్ని వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమెన్ మరణించాడు. శుక్రవారం గుండెపోటు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నాసిక్ జైలు అధికారులు తెలిపారు.

ఉదయం పది గంటల సమయంలో జైల్లో బ్రష్ చేసుకుంటూ యూసుఫ్ స్పృహ తప్పి పడిపోవడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు టైగర్ మెమెన్‌కి యూసుఫ్ సోదరుడు. ఈ కేసులో అతను దోషిగా తేలడంతో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018 జూలై 26 నుంచి యూసుఫ్ జైలులో ఉండగా.. టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు.