గాంధీనగర్: ప్రేయసిని చూసేందుకు ఓ యువకుడు అమ్మాయి అవతారం ఎత్తాడు. అమ్మాయి మాదిరిగా డ్రెస్ వేసుకొని ప్రియురాలి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కాడు. లవర్ ను కలిసేందుకు అమ్మాయి డ్రెస్ వేసుకొన్న యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

లాక్‌డౌన్ కారణంగా తన లవర్ ను కలిసే అవకాశం దక్కలేదు. దీంతో ప్రియురాలిని కలిసేందుకు అతను మంచి ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ను అమలు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. 

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు అమ్మాయి మాదిరిగా పంజాబీ డ్రెస్ వేసుకొన్నాడు. తల మీద దుపట్టా ధరించాడు. కరోనా నేపథ్యంలో ఫేస్ మాస్క్ కూడ వేసుకొన్నాడు. మంగళవారం నాడు తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ప‌య‌న‌మ‌య్యాడు.బైక్ పై వెళ్తున్న అమ్మాయి వేషంలో ఉన్న యువకుడిని వల్సాద్ వద్ద పోలీసులు వదిలేశారు.

కానీ ఇదే రూట్ లో మరోసారి బైక్ మీద అమ్మాయి వేషంలో ఆ యువకుడు మళ్లీ ప్రియురాలిని కలిసేందుకు బయలుదేరారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావని అతడిని ప్రశ్నించారు.

also read:తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలియక, తల్లిని లేపుతూ చిన్నారి: వీడియో వైరల్

అమ్మాయి వేషంలో ఉన్న యువకుడు మాట్లాడకుండా పోలీసులకు సైగలు చేశాడు. అయితే నోటికి అడ్డుగా ఉన్న మాస్క్ ను తీసివేసి మాట్లాడాలని కోరారు. దీంతో ముఖానికి ఉన్న మాస్క్ ను తీసేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. 

తన ప్రియురాలిని కలుసుకొనేందుకు ముఖానికి మాస్క్ తో బయలుదేరినట్టుగా ఆ యువకుడు చెప్పాడు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.