తన స్నేహితురాలి కుటుంబం డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడంతో 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బు చెల్లించకుంటే నకిలీ అత్యాచారం కేసులో ఇరికిస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుజరాత్ : gujaratలోని Kutchలో 19 ఏళ్ల యువకుడు suicide చేసుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ తనను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ప్రేమ సంగతి తన స్నేహితురాలి కుటుంబానికి తెలియడంతో వారు తనను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అంతేకాదు వారడగినంత డబ్బు ఇవ్వకుంటే అతనిపై Fake rape కేసు పెడతామని బెదిరించడంతో గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. 

బాధితుడు దిగ్విజయ్ సింగ్ పర్మార్ తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కచ్‌లోని అంజర్‌లో జరిగింది. అతని స్నేహితురాలు మెహక్ కుటుంబం వారి ప్రేమ గురించి తెలిసి.. అతని నుండి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించడంతో అతను విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను రికార్డ్ చేసిన ఆడియోలో, "మెహక్ తల్లి, సోదరులు నా నుండి డబ్బు డిమాండ్ చేశారు, నేను చెల్లించకపోతే వారు నాపై ఫేక్ రేప్ కేసు పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నా దగ్గర డబ్బు లేదు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పుకొచ్చాడు. యువకుడి ఆత్మహత్య సంగతి తెలిసిన బాలిక కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వీరిపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. Krishna Districtలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి Selfie video తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మసాజ్ పేరుతో Prostitution రొంపిలోకి దింపి, అసభ్యకరంగా ఉన్న ఫొటోలను బయట పెడతామంటూ Harassmentలకు గురి చేస్తున్న ముఠా కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని ఓ హోటల్ గదిలో మంగళవారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బెరవలి శ్రీకాంత్ రెడ్డి (30) ప్రైవేట్ ఉద్యోగి. 

రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో అతడికి వివాహం అయ్యింది. శ్రీకాంత్ రెడ్డి ఉద్యోగ విధుల్లో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చి పోతున్నాడు. ఈ క్రమంలో చైతన్య, సత్యకుమార్, సునీల్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. వీరు శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల ఓ మసాజ్ సెంటర్ కు తీసుకువెళ్లి ఓ మహిళతో చనువుగా ఉండేలా చేశారు. అదే సమయంలో సెల్ ఫోన్ లో వారి ఫొటోలు చిత్రీకరించిన ఆ ముగ్గరూ.. ఫొటోలు తొలగించాలంటే తమకు భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తడికి గురైన శ్రీకాంత్ రెడ్డి మంగళవారం బెంజి సర్కిల్ లోని ఓ హోటల్ లో గది తీసుకుని తన ఆవేదనంగా చెప్పుకుంటూ ఓ సెల్పీ వీడియో తీశాడు. ఆ తరువాత హోటల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నిందితులను ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.