భార్య మేనకోడలిపై భర్త కన్నేశాడు. తనతో సన్నిహితంగా ఉండేలా కోడలికి చెప్పాలని భార్యపై తరచూ ఒత్తిడి తీసుకొచ్చేవాడు. మద్యం తాగి భౌతిక దాడి చేసేవాడు. ఈ ఆగడాలను తట్టుకోలేక భార్య అతడిని దారుణంగా హతమార్చింది. 

అతడికి 43 ఏళ్లు. పెళ్లయ్యి నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకోవాల్సిన వయస్సులో తాగుడికి బానిస అయ్యాడు. తరచూ భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇది చాలదన్నట్టు భార్య మేనకోడలిపై కన్నేశాడు. ఆమెను తనతో పడుకోబెట్టాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చేవాడు. దీంతో ఆమెకు విసుకువచ్చింది. ఒక రోజు మద్యం మత్తులో ఉన్న భర్తను దారుణంగా హతమార్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బుదౌన్ లో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14న బిల్సీ పట్టణంలోని తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ (43) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడిని గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. 

దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా విచారించారు. అందులో భాగంగా తేజేంద్ర భార్య మిథ్లేశ్ దేవిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో తన వాంగ్మూలాలను పదే పదే ఆమె మారుస్తూ చెప్పింది. దీంతో వారికి అనుమానం వచ్చింది. మరింత దర్యాప్తు కోసం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే భర్తను హత్య చేసినట్టు అంగీకరించింది. 

తన భర్త తరచూ కొట్టేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి తోడు తన మేడకోడలిపై కూడా తేజేంద్ర తేజేంద్ర కన్నేశాడని పేర్కొంది. తన కోడలిని అతడితో పడుకోబెట్టాలని వేధించేవాడని నలుగురు పిల్లల తల్లి మిథ్లేశ్ పోలీసులతో వాపోయింది. భర్త ఆగడాలు తట్టుకోలేక అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

‘‘నా భర్తను వదిలించుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ రోజు రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి ఇంటి బయట నిద్రిస్తున్నాడు. కొడవలితో అతడి గొంతు కోసి హతమార్చాను. నా కోడలిని కాపాడుకునేందుకే ఇలా చేశాను' అని ఆమె పేర్కొన్నారు. హత్యా ఆయుధానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మహిళపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని సి జైలుకు పంపినట్లు బుదౌన్ ఎస్ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు.