దేశంలో యువతులు, అమ్మాయిలు, వివాహిత మహిళలకే కాదు పండు ముసలివారికి కూడా రక్షణ లేకుండాపోతోంది. కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు కామాంధులు వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పతూ నీచానికి ఒడిగడుతున్నారు. ఇలా ఓ ఒంటరి వృద్దురాలిపై 19ఏళ్ల యువకుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 

భివానీ జిల్లాలోని ఓ గ్రామంలో 75ఏళ్ల వృద్దురాలు ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఇంటిపక్కనే ఉండే రాజా అనే యువకుడు ఉండేవాడు.  వృద్దురాలు ఒంటరిగా ఉంటోందని తెలుసుకున్న రాజా ఆమెపై కన్నేశాడు. అతడి నీచమైన ఆలోచన గురించి తెలియని వృద్దురాలు ఏదైనా సహాయం కావాల్సి వచ్చినపుడు అతడిని పిలిచేది.  

అయితే గత వారం ఆ వృద్దురాలికి పనుందని చెప్పి సదరు యువకుడు తన ఇంటికి రమ్మని పిలిచాడు. అతడి మనసులోని దురుద్దేశాన్ని గుర్తించని ఆమె అతడి ఇంటికి వెళ్లింది. ఆమె ఇంట్లోకి రాగానే ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి నిందితుడు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.  కనీసం ప్రతిఘటించలేని స్థితిలో వున్న అసహాయయురాలైన వృద్దురాలితో తన కామవాంఛ తీర్చుకున్నాడు.   

ఈ అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తన పరువు పోతుందని భావించిన నిందితుడు బండరాయితో ఆమె తలపై మోది హతమార్చాడు.  మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఊరిబైటికి తరలించి పడేశారు. 

కొన్ని రోజులుగా వృద్దురాలు కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా...పక్కింట్లో వుండే కుటుంబం ఇంటికి తాళం వేసి కనిపించకుండా తిరుగుతున్నారని తెలుసుకున్నారు. దీంతో వారి ఆచూకీ తెలుసుకుని తమదైన రీతిలో విచారించగా జరిగిన ఘోరం గురించి  బైటపెట్టారు. దీంతో నిందితుడు రాజాతో పాటు అతడిని కేసులో నుండి తప్పించడానికి ప్రయత్నించిన తల్లిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.