Asianet News TeluguAsianet News Telugu

వరస రాజీనామాల ఎఫెక్ట్... రిసార్ట్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఈ రాజ్యసభ ఎన్నికల వరకు ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. దీనిలో భాగంగానే తాజాగా దాదాపు 19మంది ఎమ్మెల్యేలను రాజస్థాన్ లోని రిసార్ట్ లకు తరలించారు.
 

19 Gujarat Congress MLAs Moved To Rajasthan Resort After 3 Resign
Author
Hyderabad, First Published Jun 8, 2020, 8:10 AM IST

దేశవ్యాప్తంగా రాజ్య సభ ఎన్నికలు సర్వం సిద్ధమౌతోంది. కరోనా వైరస్ విస్తృంతంగా వ్యాపిస్తున్నప్పటికీ.. ఈ రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. ఈ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి.

గుజరాత్ లో ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. వెంట వెంటనే ముగ్గురు రాజీనామాలతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమౌంది. ఈ రాజ్యసభ ఎన్నికల వరకు ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. దీనిలో భాగంగానే తాజాగా దాదాపు 19మంది ఎమ్మెల్యేలను రాజస్థాన్ లోని రిసార్ట్ లకు తరలించారు.

కాగా.. వడోదరలోని కార్జాన్‌ శాసనసభ్యుడు అక్షయ్‌ పటేల్‌, వాల్సాద్‌ జిల్లాలోని కప్రదా ఎమ్మెల్యే జీతూ భాయ్‌ చౌదరీ తమ పదవులకు జూన్‌ 3న రాజీనామా చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో.. మిగిలిన 19మంది ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు పంపించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా... దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో గుజరాత్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయి. వీటికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో తన ఇద్దరు అభ్యర్థులు గెలిపించుకోవడం ఆ పార్టీకి కష్టంగా మారనుంది. 

కాగా, షెడ్యూల్‌ ప్రకారం మార్చి 36న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. ఇందులో అధికార బీజేపీకి 103, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకొక్క అభ్యర్థి గెలుపొందాలి అంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బలం 66కు తగ్గిపోయింది. 

ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటకలో నాలుగు స్థానాలకు, రాజస్థాన్‌లో మూడు, మధ్యప్రదేశ్‌లో మూడు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం రాష్ర్టాల్లో ఒక్కో స్థానం చొప్పున ఖాళీలు ఉన్నాయి. మొత్తం 24 స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios