Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : అసోం అడవుల్లో 18 ఏనుగులు అనుమానాస్పద మృతి.. !!

అసోంలోని అటవీ ప్రాంతంలో ఘోరం జరిగిపోయింది. అడవిలో ఉన్న 18 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఈ ఘటనమీద ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

18 wild elephants killed by lightning strikes in assams forest - bsb
Author
Hyderabad, First Published May 14, 2021, 12:17 PM IST

అసోంలోని అటవీ ప్రాంతంలో ఘోరం జరిగిపోయింది. అడవిలో ఉన్న 18 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఈ ఘటనమీద ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే విచారణ చేయాలని అటవీ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. కొండమీద, కొండ దిగువన గజరాజుల కళేబరాలు పడి ఉన్నాయి. ఈ ఘటన మీద సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడవిలో పర్యటిస్తున్నారు. 

అసోం నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ వద్ద కాతియోటోలి పరిధిలోని కండోలి ప్రతిపాదిత రిజర్వ్డ్ ఫారెస్ట్ (పీఆర్ఎఫ్) లో గురువారం 18 అడవి ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక ప్రమాదంలో గజరాజులు మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏనుగుల మృతి వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్పందించిన పోలీసులు వెతికే పనిలో పడ్డారు. ఏనుగులు మరణించడానికి కారణమేంటి? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. 

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) అమిత్ సహే మాట్లాడుతూ.. ఇది చాలా మారుమూల ప్రాంతం. వాటి కళేబరాలను రెండు గ్రూపులుగా పడి ఉన్నట్లు కనుగొన్నాం. 14 కొండమీద, మరో నాలుగు ఏనుగులు బయట పడి ఉన్నాయి. 

ఈ సంఘటనతో తాను తీవ్రంగా బాధపడుతున్నానని అసోం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లబైద్యా అన్నారు. ఈ ఘటనమీద స్పందించిన ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్వ ‘ఆ ప్రదేశాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios