Asianet News TeluguAsianet News Telugu

రాజ్‌భవన్‌లో 18 మందికి కరోనా: ఐసోలేషన్‌లోకి గవర్నర్

మహారాష్ట్ర రాజ్ భవన్ లో కరోనా కలకలం రేపుతోంది.  రాజ్‌భవన్ లో పనిచేసే 18 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు.

18 Test Coronavirus Positive At Maharashtra Raj Bhavan, Governor In Self-Isolation
Author
Mumbai, First Published Jul 12, 2020, 4:14 PM IST

ముంబై:మహారాష్ట్ర రాజ్ భవన్ లో కరోనా కలకలం రేపుతోంది.  రాజ్‌భవన్ లో పనిచేసే 18 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు.

కరోనా సోకిన ఉద్యోగుల్లో కొందరు గవర్నర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో గవర్నర్  ఐసోలేషన్ కు వెళ్లారు.గత వారంలో రాజ్ భవన్ లో పనిచేసు ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో రాజ్ భవన్ లో పనిచేసే 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మరో 16 మందికి కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.

also read:డాక్టర్‌పై కేసు:పని మనిషి పేరుతో భార్య శాంపిల్స్

అమితాబచ్చన్ కుటుంబం కరోనా బారినపడింది. అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్,ఆమె కూతురికి కూడ కరోనా సోకిందని మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోపే తెలిపారు.

 మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు 8,139 కరోనా కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 2,46,600కి చేరుకొన్నాయి. 
ఈ నెల 13 నుండి పుణెలో  10 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. థానేలో లాక్ డౌన్ ను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించింది సర్కార్.

మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 90 శాతం నమోదయ్యాయి.  ఈ రాష్ట్రాల్లోని 49 జిల్లాల్లోని 80 శాతం కేసులు రికార్డయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios