Asianet News TeluguAsianet News Telugu

కరోనా విషాదం : రెండు రోజులుగా తల్లి శవంపక్కనే 18నెలల పాపాయి.. గుక్కపట్టి ఏడుస్తున్నా... !!

కరోనా మనుషుల్ని రాక్షసులగా మార్చేస్తోంది. మానవత్వాన్ని మరిచిపోయి.. స్వార్థపూరితంగా వ్యవహరించేలా చేస్తోంది. మానవాళికి తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఎన్నో విషాద ఘటనలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

18 months baby starved 2 day beside mother dead body, no one helps due to covid fear - bsb
Author
Hyderabad, First Published May 1, 2021, 3:07 PM IST

కరోనా మనుషుల్ని రాక్షసులగా మార్చేస్తోంది. మానవత్వాన్ని మరిచిపోయి.. స్వార్థపూరితంగా వ్యవహరించేలా చేస్తోంది. మానవాళికి తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఎన్నో విషాద ఘటనలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

కరోనా పాజిటివ్ రావడం కంటే ముందు అది ఎక్కడ అంటుకుంటుందోనన్న భయమే మరింతగా ప్రజలను వణికిస్తోంది. ఇందుకు అద్దం పట్టే ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

పూణేలో ఓ మహిళ తన 18 నెలల పాపాయితో కలిసి అద్దె ఇంట్లో ఉంటుంది, ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన ఆమె శనివారం మరణించింది. ఈ విషయం గమనించినప్పటికీ కరోనా భయంతో ఇరుగుపొరుగు వారు ఎవరూ ఆమె దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. సదరు మహిళ ఒకవేళ కరోనాతో మరణించినట్లయితే తమకు కూడా వైరస్ సోకుతుందన్న భయంతో మిన్నకుండిపోయారు.

కోవిడ్ 19 : కూర్చున్న కుర్చీలోనే కన్ను మూశాడు.. !...

దీంతో రెండు రోజుల పాటు ఆమె శవం ఇంట్లోనే ఉంది. ఆలనా, పాలనా చూసే వాళ్ళు లేక ఆ పాపాయి తల్లి మృతదేహం పక్కనే ఆకలితో ఏడుస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో చిన్నాది బాధను చూడలేక ఇంటి యజమాని ఎట్టకేలకు పోలీసులకు ఫోన్ చేయడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకున్నారు. పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలు తాగించి మానవత్వం చాటుకున్నారు. 

ఈ విషయం గురించి కానిస్టేబుల్ సుశీల గభాలే మాట్లాడుతూ... నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి 8యేళ్లు, మరొకరికి 6యేళ్లు.. ఆ చిన్నారిని చూడగానే నా కన్న బిడ్డల్నే చూసినట్లు అనిపించింది. బాగా ఆకలిగా ఉన్నాడు కదా. పాలు పట్టగానే గబగబా తాగేశాడు.. అని తల్లి మనసు చాటుకుంది.

ఇక మరో కానిస్టేబుల్ రేఖ మాట్లాడుతూ ఇప్పుడు ఆ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. కాస్త జ్వరం ఉంది. కానీ డాక్టర్ ఫరలవాలేదన్నారు. పాలు తాగించడంతో పాటు నీళ్లల్లో బిస్కెట్ ముంచి తనకు తినిపించాం. కరోనా నిర్థారణ పరీక్ష కోసం తనను ప్రభుత్వాసుపత్రికి తరలించాం’ అని పేర్కొన్నారు. 

విషాదం : ఆస్పత్రిలో బెడ్ దొరకక.. కారులోనే తుదిశ్వాస విడిచిన మహిళ......

మృతురాలి భర్త పని నిమిత్తం ఉత్తరప్రదేశ్ కు వెళ్లాడని, అతడి రాక కోసం ఎదురుచూస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. కాగా సదరు మహిళ కోవిడ్ తో మరణించిందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Follow Us:
Download App:
  • android
  • ios